Friday, 31 May 2019

ఉద్యోగాన్వేషణలో భాగంగా షైన్‌.కాం వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకుంది. వెబ్‌సైట్‌ సిఫారసు మేరకు ఐబీఎం సంస్థలో కొన్ని సాంకేతిక పరీక్షలకు హాజరైంది. ఈక్రమంలో గత నెల చివరి వారంలో షైన్‌.కాం ఉద్యోగి పేరిట ఆమెకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూకు హాజరవాల్సి ఉంటుందని సదరు ఉద్యోగి చెప్పాడు. ఇంటర్వ్యూ నిమిత్తం కొంతమొత్తం డబ్బు చెల్లించాలని కోరాడు. అలా మొదలైన వసూళ్లపర్వం నాలుగు రోజులపాటు పలు విడతలుగా సాగింది. జాబ్‌ ఆఫర్‌ లెటర్‌, కన్ఫర్మేషన్‌.. పేరిట ఆన్‌లైన్‌లోనే పలు బ్యాంకు ఖాతాలకు డబ్బులను జమ చేయాల్సి వచ్చింది. అలా మొత్తం సుమారు రూ.2లక్షలు చెల్లించిన తర్వాత తన ఫోన్లకు స్పందించడం మానేయడంతో మోసపోయానని బాధితురాలికి అర్థమైంది. దీంతో సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

యువతిని నమ్మించి డబ్బు కొట్టేసిన కేటుగాళ్లు

ఉద్యోగం కోసం వెతుకుతున్న ఓ యువతిని సైబర్‌ నేరగాళ్లు మోసగించి డబ్బు కొట్టేసిన వైనమిది. కూకట్‌పల్లి అడ్డగుట్ట సొసైటీకి చెందిన యువతి(21) ఉద్యోగాన్వేషణలో భాగంగా షైన్‌.కాం వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకుంది. వెబ్‌సైట్‌ సిఫారసు మేరకు ఐబీఎం సంస్థలో కొన్ని సాంకేతిక పరీక్షలకు హాజరైంది. ఈక్రమంలో గత నెల చివరి వారంలో షైన్‌.కాం ఉద్యోగి పేరిట ఆమెకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూకు హాజరవాల్సి ఉంటుందని సదరు ఉద్యోగి చెప్పాడు. ఇంటర్వ్యూ నిమిత్తం కొంతమొత్తం డబ్బు చెల్లించాలని కోరాడు. అలా మొదలైన వసూళ్లపర్వం నాలుగు రోజులపాటు పలు విడతలుగా సాగింది. జాబ్‌ ఆఫర్‌ లెటర్‌, కన్ఫర్మేషన్‌.. పేరిట ఆన్‌లైన్‌లోనే పలు బ్యాంకు ఖాతాలకు డబ్బులను జమ చేయాల్సి వచ్చింది. అలా మొత్తం సుమారు రూ.2లక్షలు చెల్లించిన తర్వాత తన ఫోన్లకు స్పందించడం మానేయడంతో మోసపోయానని బాధితురాలికి అర్థమైంది. దీంతో సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

ఏపీలో పింఛను అర్హత వయస్సు కుదింపు

ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన తొలి హామీకి సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం జీవోను విడుదల చేసింది. జూన్‌ 1 నుంచి కొత్త పింఛను పథకం అమలులోకి రానుంది. వికలాంగులకు రూ.3వేలు, కిడ్నీ వ్యాధితో డయాలసిస్‌ చేయించుకుంటున్న బాధితులకు రూ.10వేలు పింఛనుగా ఇవ్వనున్నారు. వృద్ధాప్య పింఛనుకు అర్హత వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పెంచిన ఈ పింఛను మొత్తాన్ని జులై 1 నుంచి అందించనున్నారు.

ప్రియుడి కోసమే భర్త హత్య

కరప మండలంలో ఇటీవల జరిగిన నవ వరుడి హత్య కేసులో చిక్కుముడి వీడింది. కట్టుకున్న భార్యే తన ప్రియుడు రాధాకృష్ణతో కలిసి పథకం ప్రకారం భర్తను కిరాతకంగా హత్య చేయించినట్లు తేలింది. పేకేటి సూర్యనారాయణ(28) ఎంఎస్సీ చదివారు. మండపేటలోని శ్రీవికాస జూనియర్‌ కళాశాల్లో అధ్యాపకుడిగా పనిచేసేవారు. గ్రామంలో సౌమ్యుడిగా పేరున్న సూర్యనారాయణకు మే 15న కరప శివారు గ్రామం పేపకాయలపాలెం వాసి మద్దూరి వెంకటేశ్వరరావు కుమార్తె నాగలక్ష్మిని ఇచ్చి వివాహం చేశారు. అంతకు రెండేళ్ల ముందు నుంచే నాగలక్ష్మికి నిందితుడు రాధాకృష్ణతో వివాహేతర సంబంధం ఉంది. ఈనెల 21న మధ్యాహ్నం సూర్యనారాయణ అత్తవారింటి నుంచి కరపకు వచ్చి అదేరోజు సాయంత్రం తిరిగి వేపకాయపాలెం వెళ్లారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో బయటకు వెళ్తూ ఎనిమిదింటికల్లా తిరిగివస్తానని భార్యతో చెప్పిన ఆయన అప్పటి నుంచీ కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు సూర్యనారాయణ కోసం గాలించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో నిందితుడు రాధాకృష్ణ సూచనల మేరకు 22న ఉదయం పెనుగుదురు-పాతర్లగడ్డ రహదారిలో పంటపొలానికి సమీపంలో వెదకగా సూర్యనారాయణ మోటారుసైకిల్‌ కనిపించింది. పొలంలో  సూర్యనారాయణ మృతదేహం లభించింది. అతడి తలపై నరికి కిరాతకంగా హత్య చేసి గడ్డి కప్పి ఉంచడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో కాకినాడ గ్రామీణ సీఐ పి.ఈశ్వరుడు ఆధ్వర్యంలో ఎస్సై జి.అప్పలరాజు, పోలీసులు, డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌టీంలతో సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. రాధాకృష్ణపై అనుమానంతో అతణ్ని తమదైన శైలిలో విచారించటంతో నేరాన్ని అంగీకరించాడు. తమ వివాహేతర  బంధానికి అడ్డులేకుండా సూర్యనారాయణను అంతంచేయాలని నాగలక్ష్మి కోరడంతోనే తానీ హత్యకు పథకం రచించానని నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు. పార్టీ చేసుకుందామంటూ సూర్యనారాయణను పంటపొలం వద్దకు తీసుకెళ్లి అక్కడ అంతం చేశానని చెప్పాడు. ఈ క్రమంలో హత్య జరిగిన ఎనిమిది రోజుల్లో నేరాన్ని ఛేదించి నిందితులు రాధాకృష్ణ, నాగలక్ష్మిలను అరెస్టు చేశామని, హతుడి వద్ద దొంగిలించిన బంగారు ఆభరణాలు, కత్తి, మరో ఆయుధం గురువారం స్వాధీనం చేసుకున్నామని సీఐ ఈశ్వరుడు తెలిపారు.
.

దుస్తులు మార్చుకునే గదిలో రహస్య కెమెరా,విందుకు ఆహ్వానించి..నగ్న చిత్రాలు తీసి..

హైదరాబాద్‌: బలవంతంగా లొంగ దీసుకునేందుకు.. తాము చెప్పినట్లు నడుచుకోవాలన్న కక్షతో ఇద్దరు సైబర్‌ నేరస్థులు ఒక యువతి నగ్నచిత్రాలు, వీడియోలను ఆమెకు తెలియకుండా తీశారు.. ఆమె ఒక యువకుడితో కలిసి ఉన్నట్టు ఆ ఫొటోలను మార్ఫింగ్‌ చేశారు. వీటిని ఆమెకు, ఆమె సోదరుడి చరవాణికి పంపించారు. మరిన్ని చిత్రాలు పంపుతామంటూ ఆమె సోదరుడిని హెచ్చరించారు. నగ్నచిత్రాలు చూసి ఆందోళన చెందిన బాధితురాలు తనకే పాపం తెలీదంటూ సోదరుడికి చెప్పగా వెంటనే బాధితురాలి సోదరుడు ఆమెతో కలిసి బుధవారం రాత్రి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాతబస్తీలో ఐదురోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీస్‌ అధికారులు ప్రాథమిక వివరాలు సేకరించారు. ఇద్దరు యువకులను గుర్తించారు. వీరు ఫోన్లు స్విచ్చాఫ్‌ చేయడంతో గాలింపు చర్యలు   చేపట్టారు.

భర్తతో విభేదాలు.. ఆకర్షించేందుకు యత్నాలు..

పాతబస్తీలో ఒక యువతి భర్తతో విభేదాల కారణంగా కొద్దినెలలుగా తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు యువకులు ఆమెను ఎలాగైనా ఆకర్షించి లొంగ దీసుకోవాలని పథకం వేశారు. రెండు, మూడునెలల నుంచి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆమె విముఖత ప్రదర్శించింది. దీంతో ఆమెకు దగ్గరయ్యేందుకు ఇతర మార్గాలపై దృష్టి సారించారు. యువతి ఇంటిపక్కనే ఉంటున్న ఓ మహిళ ద్వారా వల వేయాలని నిర్ణయించారు. సదరు మహిళతో ఒక యువకుడికి బంధుత్వం ఉండటంతో ఆమె ఇంటికి తరచూ వెళ్లేవారు. అలా ఆ మహిళతోపాటు బాధితురాలి ఇంటికి వెళ్లేవారు. ఒక్కోసారి ఆ మహిళ బాధితురాలిని తన ఇంటికి తీసుకువచ్చేది. నిందితులిద్దరినీ చూడగానే ఆమె వెళ్లిపోయేది. ఇక లాభం లేదననుకున్న యువకులు పదిరోజుల క్రితం తమ పథకాన్ని అమలు చేయాలని గట్టిగా అనుకున్నారు. బాధితురాలి పక్కింటివారు విందు ఏర్పాటు చేస్తున్నారని తెలుసుకున్నారు. వెంటనే కార్యచరణ ఆరంభించారు. విందుకు తప్పనిసరిగా యువతిని పిలిపించాలంటూ మహిళను అభ్యర్థించారు.

పండ్ల రసం దుస్తులపై ఒంపి..

తమ ఇంట్లో విందుకు రావాలంటూ మహిళ ఐదురోజుల క్రితం యువతిని ఆహ్వానించింది. బాధితురాలి వెన్నంటే ఉన్న ఇద్దరు యువకులు అందరి భోజనం పూర్తయ్యాక ఉద్దేశపూర్వకంగా ఆమె దుస్తులపై పండ్లరసం ఒలికేలా చేశారు. శుభ్రం చేసుకోండి అంటూ మహిళతో బాధితురాలిని దుస్తులు మార్చుకునే గదిలోకి వెళ్లేలా చేశారు. గదిలో ఎవరూ లేకపోవడంతో పండ్ల రసాన్ని శుభ్రం చేసుకునేందుకు ఆమె దుస్తులు విప్పేసి నీళ్లతో శుభ్రం చేసుకుని బయటకు వచ్చి ఇంటికి వెళ్లిపోయింది. మంగళవారం సాయంత్రం ఆమె సోదరుడి చరవాణికి, ఆమె చరవాణికి ఫొటోలు వచ్చాయి. వాటిని చూసిన వెంటనే ఆమె అవాక్కయింది. సోదరుడి ఓదార్పుతో తేరుకున్న ఆమె బుధవారం రాత్రి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు విషయాన్ని వివరించారు. బాధితురాలు గదిలోకి వెళ్లక ముందే నిందితులు ఒకటి, రెండు చరవాణులను రహస్య ప్రాంతంలో అమర్చి ఉంటారని పోలీసులు వారిద్దరికీ వివరించారు. వీలైనంత వేగంగా నిందితులను అరెస్ట్‌ చేస్తామంటూ వారికి చెప్పారు.



Mr. White Powder - 3KG+1KG FREE (4KG)

Mr. White Powder - 3KG+1KG FREE (4KG)


                                      Click here to view the price

TREATMENT OFFER

If you are facing any Disc problems, Joint pains, Sciatica, Rheumatoid Arthritis (RA), Gout, Diabetes, Thyroid, Infertility problems, PCOD, Psoriasis, Gastric problems, Piles, Asthma, Allergies and Kidney Disorders you can get the discount in treatment and 6 months of free treatment for one of your family members along with medicines.


CLICK HERE FOR MORE INFORMATION